Date : 22-02-2023
ఆకివీడు : అభం శుభం తెలియని బాలికకు మాయమాటలు చెప్పి లైంగిక దాడికి యత్నించడం మండలంలో సంచలనంగా మారింది. అయితే బాలిక అరుపులు కేకలు వేయడంతో స్థానికులు స్పందించి అత్యాచారయత్నం చేసిన వారికీ దేహశుద్ది చేసి పోలీసులుకు అప్పగించారు. వివరాల్లోకి వెళ్ళితే ఓ కాలనీ కి చెందిన బాలిక మూడవ తరగతి చదువుతుంది. మంగళవారం మధ్యాహ్నం అదే కాలనీ కి చెందిన ఇద్దరు అన్నదమ్ములు ఎస్ కె . మస్తాన్, ఖాన్ లు బాలికకు చాక్లెట్ ఎరగా చూపి స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డు ప్రాంగణంలోని పాత భవనం లోకి తిసుకెళ్లారు. ఇది గమనించిన స్థానిక యువకుల వారిని వెంబడించారు. ఘటన స్థలికి వెళ్ళేటప్పటికి బాలికపై అకృత్యం పాలపడుతున్నట్టు గుర్తించి వారిని అడ్డుకుని యార్డు అధికారులకు, ఉపాధ్యాయులకు సమాచారం ఇచ్చారు. ఇంతలో బాధిత కుటుంబ సభ్యులు, స్థానికులు అక్కడికి చేరుకొని నిందితులకు దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై బాలిక తల్లి ఇచ్చిన పిర్యాదు మేరకు నిందితులపై ఎస్సి, ఎస్టీ, వేధింపుల అత్యాచారయత్నం, పోక్సో కేసులు నమోదు చేసినట్టు ఏఎస్సై సంజీవరావు తెలిపారు.