Date : 14.12.2022
ఆకివీడు టౌన్ : జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఆకివీడు జాతీయ రహదారి ఇరువైపులా రోడ్డు మార్జిన్ ఆక్రమణల్ని మంగళవారం తొలగించారు. నగర పంచాయతీ శానిటరీ సిబ్బంది, సిబ్బంది ప్రొక్లైనర్ లతో మార్జిన్లను తొలగిస్తున్నారు. డ్రైనేజీ వెలుపల ఉన్న బోర్డులు, షెడ్లు, తొలగించి రోడ్డు వెడల్పునకు చెర్యలు చేపట్టారు. దీనిపై నగర పంచాయతీ కమిషనర్ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు రోడ్డుకు కి ఇరువైపులా ఉన్న ఆక్రమణలను తొలగించి రోడ్డు వెడల్పునకు చెర్యలు చేపట్టామన్నారు. దీనివల్ల షాపులకు వెళ్లే వాహన చోదకులకు షాప్ ముందు వాహనం నిలుపుకునే అవకాశం ఉంటుందన్నారు. ప్రస్తుతం షాప్ యజమానులు రోడ్డు మార్జిన్లు ఆక్రమించడంవల్ల ట్రాఫిక్ కు ఇబ్బందిగా ఉంటుందన్నారు.