ఆకివీడు : ద్విచక్ర వాహనంపై వెంబడిస్త వెకిలి చేష్టలకు పాల్పడిన ఇద్దరు ఆకతాయిలకు పెళ్లి బృందం సభ్యులు దేహశుద్ చేసారు. ఆకివీడు లోని జాతీయ రహదారిపై శుక్రవారం ఈ ఘటన జరిగింది. స్థానికుల కథనం ప్రకారం కృష్ణ జిల్లా చాట కాయ్ ప్రాంతానికి చెందిన వారు తూర్పుగోదావరి జిల్లా లోని ఓ పుణ్య క్షేత్రం లో వివాహం అనంతరం వదువరులతో సహా మినీ వ్యాన్లో బయలుదేరారు. ఉండి ప్రాంతానికి వచ్చే సరికి నెంబర్ ప్లేట్ లేని ద్విచక్ర వాహనంపై పెళ్లి బృందం వ్యాన్ ను వెంబడిస్తూ వ్యాన్ లో ఉన్న యువతులను ఉద్దేశించి వెకిలి చేష్టలకు పాలపడ్డారు. ఆకివీడు వచ్చిన వారు వెంబడిస్తూ ఉండడంతో పెళ్లి బృందం సభ్యులు సహనం కోల్పోయి ఆకివీడు ఎస్ టర్నింగ్ లో తమ వాహనాన్ని అపి ఆ యువకులను పట్టుకున్నారు. పెళ్లి బృంద సభ్యులంతా ఆ యువకులను పట్టుకుని చొక్కాలు ఊడదీసి చితక బాదారు. స్థానికులు, వాహన దారులు గుమ్మిగూడటంతో కొద్దిసేప ట్రాఫిక్ భారీగా స్తంభించింది. అనంతరం పెళ్లి బృందం వారి వాహనంలో వెళ్లిపోయారు. ఆ యువకులు అక్కడినుండి జారుకున్నారు. వారు నెంబర్ ప్లేట్ లేని వాహనంలో రావడంతో గొలుసు చోరీ సబ్యులని స్థానికులు అభిప్రాయ పడ్డారు.