Date : 02-03-2022
ఆకివీడు : రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన కొల్లేటికోట పెద్దింట్లమ్మ జాతర ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ మహోత్సావాలు ఏటా పాల్గుణ శుద్ధ పాడ్యమి మొదలు పౌర్ణమి మార్చి 3 నుంచి 18 వరకు వైభవంగా జరుగుతాయి. ఇందులో ప్రధాన ఘట్టమైన శ్రీ జలదుర్గ, గోకర్ణేశ్వరా స్వామి వార్ల కళ్యాణం మార్చి 15 న జరగనుంది. ఈ నెల 18న అమ్మవారికి తెప్పోత్సవం నిర్వహించనున్నారు. ప్రతి రోజు సాయంత్రం అమ్మవారికి పంచ హారతులు నిర్వహించనున్నారు. జాతరను ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు, ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ ప్రారంభించనున్నారు. పెద్దింట్లమ్మ జాతరకు అన్ని ఏర్పాట్లు ఆలయం ఈవో కేవీ. గోపాలరావు పూర్తి చేసారు. భక్తులకు చలువ పందిర్లు నిర్మించారు. గుడివాడ డీఎస్పీ సత్యానంద ఆధ్వర్యంలో భారి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చెయ్యనున్నారు. జాతర కమిటీ ఛైర్మెన్ గా గుడివాడ ఆర్డిఓ వ్యవహరిస్తున్నారు. పార్కింగ్, ట్రాఫిక్ అంతరాయం లేకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు.
అమ్మవారి దేవస్థానికి ఇలా చేరాలి.
కైకలూరు - భీమవరం రూట్ పామర్రు - దిగమర్రు 165 జాతీయ రహదారి లో ఆలపాడు వద్ద బస్సు దిగాలి. అక్కడనుంచి 7 కిలోమీటర్లు దూరంలో అమ్మవారి దేవస్థానికి చేరుకోవొచ్చు. ఎక్సప్రెస్ రైళ్లు ఆకివీడు , కైకలూరు మార్గం లో ఆగుతాయి. ప్యాసింజర్ రైళ్లు పల్లెవాడ రైల్వే స్టేషన్ లో ఆగుతాయి. అక్కడినుంచి ఆటో లో అమ్మవారి దేవస్థానికి చేరుకోవొచ్చు. ఆర్టీసీ వివిధ ప్రాంతాలనుంచి సర్కారు కాల్వ వరకు బస్సు సౌకర్యం ఏర్పాటు చేసారు.