Date : 30-12-2021
ఆకివీడు పట్టణ :డివైఎఫ్ఐ సంక్రాతి యువజనోత్సవాలు ఈ ఏడాది విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, ఆంధ్రకు ప్రత్యేక హోదా కల్పించాలి అనే నినాదాలతో క్రీడా పోటీలు జనవరి తొమ్మిది నుంచి ప్రారంభమవుతాయని ఆహ్వాన సంఘ కార్యదర్శి బి.రాంబాబు చెప్పారు. సంఘ కార్యాలయంలో సంక్రాతి యువజవనోత్సవాలు వివరాలను వివరించారు. రాష్ట్రస్థాయి చెడుగుడు పోటీలతో పాటు ఈ ఏడాది మహిళా వాలీబాల్ పోటీలు, నిర్వహిస్తున్నట్టు చెప్పారు. విద్య టు బాడీ బిల్డింగ్ ముగ్గులు పోటీలు, జిల్లా స్థాయి చెస్ పోటీలు నిర్వహిస్తున్నారు. డి. రవితేజ, జి. ధనుష్, కె. శంకర్ తదితరులు పాల్గున్నారు. తొలుత డివైఎఫ్ఐ నాయకులు ఎం.లెనిన్ బాబు, బి.సత్యవతి, సావిత్రమ్మల మృతికి సంతాపం తెలిపారు.