ఆకివీడు : ఆకివీడు నగర పంచాయతీ ఎన్నికలను వైస్సార్ సీపీ, టీడీపీ, జనసేన పార్టీలు పతిష్టాత్మకంగా తీసుకున్నాయి. డిప్యూటీ సీఎం, మంత్రులు, ఎంమ్మెల్యేలు, ఎంమ్మెల్సీలు, తదితర ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకులూ మకాం వేసి మంతనాలు చేస్తున్నారు. ఆకివీడు లోని 20 వార్డులలో వైస్సార్ సీపీ , టీడీపీ, జనసేన, సిపిఎం, కాంగ్రెస్, స్వతంత్ర అభ్యర్థులుగా 46 మంది బరిలో ఉన్నారు. ఈ నెల 15వ తేదీన పోలింగ్, 17న ఓట్ల లెక్కింపు పక్రియ జరగనుంది. పోలింగ్ సమయం సమీపిస్తున్న నేపథ్యంలో గురువారం మంత్రులు ఆళ్ళ నాని, శ్రీ రంగనాథరాజు, ఎంమ్మెల్యే గ్రంధి శ్రీనివాసు, పుప్పాల వాసు బాబు, తలరి వెంకటరావు, ఎం.ప్రసాదరాజు, కారుమూరి నాగేశ్వరరావు, జడ్ పి ఛైర్మెన్ కవురు శ్రీనివాసు, ఉండి సమన్వయకర్త రామరాజు, డీసీసీబీ ఛైర్మెన్ నరసింహరాజు, క్షత్రియ కార్పొరేషన్ ఛైర్మెన్ సర్రాజు తదితర వైస్సార్ సీపీ నాయకులూ ఆకివీడు వైస్సార్ సీపీ కార్యాలయంలో సమావేశమయ్యారు. చరిత్ర సృష్టిస్తున్న ముఖ్యమంత్రి వైస్ జగన్ మోహన రెడ్డి రెండున్నర పాలనలో అన్ని మైలు రాళ్లేనని డిప్యూటీ సీఎం ఆళ్ల నాని అన్నారు. ఎన్నికలపై సమాలోచనలు చేసి వైస్సార్ సీపీ అభ్యర్థుల విజయం కోసం సమిష్టిగా కృషి చెయ్యాలని నిర్ణయించుకున్నారు.
స్థానిక టీడీపీ కార్యాలయంలో నరసాపురం పార్లమెంట్ టీడీపీ అధ్యక్షురాలు తోట సీతామహాలక్ష్మీ, ఏలూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు, ఎంమ్మెల్యే మంతెన రామరాజు, ఎంమ్మెల్సీ ఫాందువ్వ శ్రీను, అంగర రామ్మోహనరావు, శాసన మండలి మాజీ అధ్యక్షుడు షరీఫ్, మాజీ మంత్రి పీతల సుజాత, తాడేపల్లిగూడెం టీడీపీ సమన్వయకర్త వలవల బాబ్జి, మోటుపల్లి రామ వరప్రసాద్ తదితర నాయకులూ ఎన్నికలపై చర్చించారు.