Date : 31-08-2021
ఆకివీడు పట్టణ: ఆకివీడు లోని ఎస్ టర్నింగ్ సమీపంలో ఉన్న రమేష్ హాస్పటల్ కు అనుమతులతో పాటు, అరుహులైన వైద్యులు లేకుండా నిర్వహిస్తున్న ప్రైవేట్ ఆస్పత్రిని వైద్యాధికారులు సోమవారం సీజ్ చేశారు. వైద్య అధికారుల సమాచారం ప్రకారం పొదలి రమేష్ నిర్వహిస్తున్న రమేష్ హాస్పటల్ పై పిర్యాదు రావడంతో కలెక్టర్, డిఎంహెచ్ఓ ఆదేశాల మేరకు నర్సాపురం డిప్యూటీ వైద్యాధికారి ప్రసాద్, జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి అడ్మినిస్ట్రేటివ్ అధికారి డాక్టర్ పి.బాలు ఈ ఆస్పత్రిలో సోమవారం తనిఖీ నిర్వహించారు. నిబంధనలు విరుద్ధంగా వైద్య సేవలు అందిస్తున్నట్టు గుర్తించి ఓపీ విభాగం, వార్డులు, ఔషదాల విభాగాన్ని సీజ్ చేసారు. తదుపరి చర్యల నిమిత్తం పూర్తిస్థాయి నివేదికని ఉన్నతాధికారులకు అందజేస్తామని డిప్యూటీ డిఎంహెచ్ఓ ప్రసాద్ తెలిపారు.