Date : 31-08-2021
ఆకివీడు : విశాఖ ఉక్కుతోపాటు ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను అడ్డుకుందామంటూ ప్రజా సంఘాల నాయకులూ ఆకివీడు లో సోమవారం నిరసన ప్రదర్శన చేపట్టారు. స్థానిక గాంధీ విగ్రహం కూడలిలో నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను విడనాడాలని సూచించారు. సిఐటియూ మండల అధ్యక్షుడు పెంకి అప్పారావు, కె. తవిటి నాయుడు తదితరులు పాల్గొన్నారు.