Date : 15-02-2021
ఆకివీడు పట్టణ: ఆకివీడు నగర పంచాయతీ పరిధి లో ఎస్సి, ఎస్టి, బిసి, మహిళా ఓటర్ల సంఖ్యను గుర్తించేందుకు వార్డులు వారీగా సర్వే చేస్తున్నారు. ఇక్కడ కూడా 20 వార్డులను కొనసాగిస్తూ సంఖ్యలు, సరిహద్దుల్లో మాత్రం కొన్ని మార్పులు చేసారు. పట్టణ, వార్డుల సరిహద్దులతో నూతన రేఖ పటాన్ని తయారు చేసారు. 2020 నవంబర్ నాటికీ పట్టణంలో 25,792 మంది ఓటర్లు ఉన్నారు. ఈ సంఖ్య ఆధారంగా ప్రతి వార్డులో రెండు పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. ఈ నెల 15 నాటికీ వార్డులవారి సర్వే ను పూర్తి చేసి 27న ఓటర్ల జాబితాను ప్రజలకు అందుబాటులో ఉంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు.
పొరపాట్లకు తావులేకుండా....
ఆకివీడు నగర పంచాయతీ పరిధి వార్డుల విభజన చేస్తూ తుది ఓటర్ల జాబితా రూపకల్పనకు సన్నాహాలు చేస్తున్నాం. ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ఈ పక్రియను పూర్తి చేసేలా నిశిత పరిశీలనతో ముందుకు సాగుతున్నాం. వార్డుల వారీగా కొన్ని మార్పుచేర్పులు చేసాం. జాబితా ప్రకటన అనంతరం ఓటర్లు అభ్యంతరాలు తెలియజేయచ్చు.
బి. సల్మాన్ రాజు , కమిషనర్, ఆకివీడు.
మార్పులు అనంతరం గత - ప్రస్తుత వార్డుల సంఖ్యను వరుస క్రమంలో ఇలా .
గత వార్డు సంఖ్య |
ప్రస్తుత వార్డు సంఖ్య |
1 |
12 |
2 |
9 |
3 |
8 |
4 |
7 |
5 |
6 |
6 |
5 |
7 |
4 |
8 |
3 |
9 |
2 |
10 |
1 |
11 |
20 |
12 |
19 |
13 |
18 |
14 |
10 |
15 |
17 |
16 |
16 |
17 |
14 |
18 |
13 |
19 |
11 |
20 |
15 |