Date : 10-09-2020
ఆకివీడు : పామర్రు - దిగమర్రు 165వ జాతీయ రహదారి ఆకివీడు నగర పంచాయతీ పరిధిలో అనేక చోట్ల గోతులు ఏర్పడ్డాయి. భారీ వర్షాలకు రహదారి మరింత అద్వానంగా తయారైంది. దింతో వాహనచోదకులు, ప్రయాణికులు నానా అవస్థలు పడుతున్నారు. ఎట్టకేలకు జాతీయ రహదారి అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. పశ్చిమ, కృష్ణ జిల్లాల సరిహద్దు ప్రాంతం నుంచి ఆకివీడు శివారు తెల్లవంతెన వరకు సుమారు 6 కి.మీ మేర జాతీయ రహదారిని అభివృద్ధి చేయన్నునారు. ఈ పనుల్లో భాగంగా బుధవారం ఆకివీడు లో రహదారిపై గోతులకు మర్మతులు ప్రారంభించారు. మరమ్మతులు పూర్తి చేసి అనంతరం రహదారి నిర్మాణ పనులు చేస్తామని ఎన్ హెచ్ ఏఈ ఎన్.శ్రీనివాసరావు తెలిపారు.