ఆకివీడు : అంతర్వేదిలో లక్ష్మి నరసింహ స్వామి దేవస్థానం ఉత్సవ రథం దగ్ధం చేయడాన్ని నిరసిస్తూ ఆకివీడు హిందూ ఐక్య వేదిక సోమవారం నిరసన వ్యక్తం చేసింది. ఈ మేరకు ఐక్య వేదిక సభ్యులు నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ దోషులను కఠినంగా శిక్షించాలని, నిర్లక్ష్యంగా వ్యవహరించిన దేవస్థానం ఉద్యోగులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో నేరెళ్ల పెదబాబు, ఎర్ర రఘు, పలువురు యువకులు, బ్రాహ్మణా సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు.