Date : 14-09-2020
ఆకివీడు: అయి భీమవరం నుంచి గుమ్ములూరు శివారు వరకు సుమారు 8 కిలోమీటర్ల రహదారి అభివృద్ధికి సీఆర్ఎఫ్ నిధులు రూ.12 కోట్లు మంజూరైనట్లు ర.భ శాఖ ఏఈ వర్మ తెలిపారు. ప్రస్తుతం 5.5 మీటర్ల వెడల్పున ఉన్న ఈ రహదారిని 7 మీటర్లకు పెంచనున్నట్టు తెలిపారు. అదేవిధంగా సుమారు 1200 మీటర్ల పొడవునా సీసీ, మిగిలిన భాగం బీటీ రహదారిగా నిర్మించనున్నట్టు తెలిపారు.