Date :27-08-2020
ఆకివీడు: ఆకివీడు నగర పంచాయతీలో ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామని మునిసిపల్ కమిషనర్ బి.సాల్మాన్ రాజు చెప్పారు. పట్టణంలో 13,14,15,16 వార్డుల్లో బుధవారం వైసీపీ నాయకులతో కలసి కమిషనర్ పర్యటించారు. వార్డుల్లో ఉన్న సమస్యలని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పలు వార్డుల్లో మంచినీరు, డ్రైయిన్ల సమస్య తీవ్రంగా ఉందన్నారు. మండల కన్వీనర్ కేశిరెడ్డి మురళి మాట్లాడుతూ గత పాలకుల నిర్లక్ష్మ వల్ల పలు వార్డుల్లో మంచినీరు, డ్రైయిన్ల సమస్య అస్తవ్యస్తంగా ఉందని, ఈ సమస్యలను వైసీపీ నియోజకవర్గ కన్వీనర్ దృష్టికి తీసుకెళతామన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు శిరపు శ్రీనివాస్, మహిళా సమాఖ్య అధ్యక్షురాలు మోర జ్యోతి, మండల యూత్ అధ్యక్షుడు అంబటి రమేష్, మాజీ ఎంపీటీసీ పుప్పాల పండు, రంబ శివ, జగదీశ్, పడాల సురేష్ రెడ్డి, జోగి నాగరాజు పాపాల్గొన్నారు.