Date : 14-07-2020
ఆకివీడు అర్బన్: కరోనా మహమ్మారితో చనిపోయిందో లేదో తెలియదు కానీ, బంధువులు, పేగుతెంచుకుని పుట్టినవారు కూడా ఆమేనా కన్నెత్తి చూడలేదు. ఆకివీడు సామజిక ఆరోగ్య కేంద్రంలో సైకిల్ స్టాండ్ వద్ద అనాథ శవంగా పడి ఉంది. వివరాల్లోకి వెళ్తే.. స్థానిక అయి భీమవరం రోడ్డులోని కాలవ గట్టున నివసిస్తున్న వడలి పార్వతి(52) గత పదిహేను రోజుల గా అనారోగ్యం తో ఉంది. ఆమె తన తల్లి వద్దే ఉంటుంది. ఆమె కుమారుడు, కూతురు ఉన్నారు. ఆదివారం ఆమెకు తీవ్ర అనారోగ్యంతో ఉంటె స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాడు. వైద్యం అందించిన కొద్దిసేపటికే ఆమె మృతి చెందడంతో ఆసుపత్రి వద్దే వదిలివేసి వెళ్ళిపోయాడు. స్థానిక సిహెచ్ వైద్యఅధికారి రంగారావు కరోనా పరీక్షల కోసం నమూనా సేకరించారు. మృత దేహాన్ని అయన , అటెండర్ కలిసి ప్యాకింగ్ చేసి, సైకిల్ స్టాండ్ వద్ద ఉంచారు. తెల్లవార్లూ మృతదేహం అక్కడే ఉంది. కరొనతో ఆమె చనిపోయిందని కుమారుడు, బంధువుల భావించి మృతదేహం వద్దకు ఉదయం 9 గంటల వరకు రాలేదని రంగారావు చెప్పారు. ఎసై వీరభద్రరావుకు, రెవిన్యూ అధికారులకు సమాచారం అందించారు. దింతో మృతురాలి కుమారుడు, బంధువుల సమక్షంలో అంతిమ కార్యక్రమాన్ని నగర పంచాయతీ పరిశుద్గ్య కార్మికులు చేయించారు.