ఆకివీడు : లాక్ డౌన్ నిబంధలని అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని ఆకివీడు నగర పంచాయతీ మేనేజర్ వెంకటేశ్వరావు, ఎసై వీరభద్రరావు హెచ్చరించారు. స్థానిక ప్రధాన సెంటర్లలోని అన్ని షాపుల వద్దకు శుక్రవారం వెళ్లి నిబంధలను వివరించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ ఆకివీడులో కరోనా కేసులు పెరుగుతున్నందున ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు లాక్ డౌన్ విదించామన్నారు. ఉదయం 6 నుండి 10 గంటల వరకు దుకాణాలకు అనుమతి ఉందన్నారు. వ్యాపారస్తులు, ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేసారు. కరోనా వైరస్ ప్రభావంతో ఈ ప్రాంతంలో ప్రజలు ఇబ్బంది పడుతున్న విషయాన్నీ దృష్టిలో పెట్టుకుని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. లాక్ డౌన్ కాలంలో ప్రజలు ఇష్ఠానుసారంగా తిరిగితే కఠినమైన చర్యలు తప్పవన్నారు. కంటైన్మెంట్ జోన్ లో ప్రజలు బయటకి రాకుండా సహకరించాలన్నారు.