Date : 24-06-2020
ఆకివీడు లో మొత్తం కేసులు: 3, డిశ్చార్జ్ అయినవారు: 2, యాక్టీవ్ లో ఉన్నవి: 1
ఆకివీడు పట్టణ : ఆకివీడు లో మంగళవారం కరోనా కేసు నమోదు అవ్వడంతో ఆకివీడు పట్టణం మరోసారి ఉలిక్కిపడింది. మాదివాడ లోని 64 ఏళ్ళ వృధురాలకి కరోనా పరీక్షల్లో పోజిటివ్ గా రావడంతో ఆమెను ఏలూరు లోని ఆశ్రమం కోవిడ్ ఆసుపత్రికి తరలించారు. ఆమెను ప్రత్యేకంగా, పరోక్షంగా కలిసిన వారిని హోమ్ క్వారంటైన్ లో ఉండాలని అధికారులు ఆదేశించారు. వృదురాలు ఈ నెల 15న హైద్రాబాద్ నుంచి ఆకివీడు వచ్చారు. 18న వైద్య సిబ్బంది ఆమెకు ఉన్న లక్షణాలను గుర్తించిన వెంటనే పరీక్షలు నిర్వహించారు. వీ ఆర్ డి ఏల్ పరీక్షల కోసం నమూనాను విజయవాడ పంపించారు. మంగళవారం ఫలితాలు రావడంతో ఆమెకు కరోనా పోజిటివ్ గా గుర్తించారు. దింతో ఆ ప్రాంతంలో 200 మీటర్లు కంటైన్మెంట్ జోన్ గా, మరో 200 మీటర్లు బఫర్ జోన్ గా ఏర్పాటు చేసారు. మాదివాడ లోని మోటుపల్లి వారి వీధీ నుంచి 400 మీటర్ల వరకు కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించారు. ఈ ప్రాంతంలో ముమ్మరంగా పారిశుధ్య పనులను నిర్వహించారు. విస్తృత సర్వే నిర్వహించేందుకు వలంటీర్లు, ఏ ఎన్ ఎం లు, ఆశావర్కర్లు రంగంలోకి దిగారు. ప్రజలు ఆందోళన చెందకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటు హోమ్ క్వారంటైన్ లో ఉండాలని, అత్యవసరం కానీ సందర్భంలో బయటకి రాకూడదని తహసీల్ధార్ జి జ్ స్ కుమార్ తెలిపారు.