Date : 25-03-2020
అంత కట్టుదిట్టం
అంత కట్టుదిట్టం
ఆకివీడు : కరోనా వైరస్ ను కట్టడి చేసే భాగంలో పోలీస్ లు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా మంగళవారం నాడు ఆకివీడు ఎస్ ఐ వీరభద్రరావు ఆధ్వర్యంలో పోలీసులు కృష్ణ - పశ్చిమ గోదావరి జిల్లా సరిహద్దుల ప్రాంతమైన ఉప్పుటేరు వంతెన వద్ద వాహనదారులను అడ్డగించి వారికీ అవగాహనా కలిపించారు. అత్యవసరమైన వాహనాలను తప్ప మిగిలిన వాహనాలను వెనుకకు పంపించారు. ఆకివీడు జాతీయ రహదారిపై ప్రహర కాస్తూ అనవసరంగా రహదారులపైకి వచ్చే వాహనదారులకు జరిమానా విధించారు. వ్యాపారాలు స్వచందంగా దుకాణాలను మూసివేశారు. కరోనా వైరస్ నిరోధానికి ప్రజలు సహకరించాలని ఎస్ ఐ కోరారు.