ఆకివీడు అభివృద్ధికి సహకరించాలి
Date : 12-02-2020
Date : 12-02-2020
ఆకివీడు పట్టణ : పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుతూ ప్రతి ఒక్కరు ఆకివీడు నగర పంచాయతీ అభివృద్ధికి సహకరించాలని నగర పంచాయతీ కమీషనర్ కె. ప్రభుదాసు అన్నారు. స్థానిక ఎస్ టర్నింగ్ లోని సాయిబాబా మందిరం వద్ద పంచాయతీ కుళాయిలు ద్వారా త్రాగు నీరు ఏళ్ళ తరబడి రావడం లేదని పిర్యాదు మేర మంగళవారం ఆయన పరిశీలించి స్థానికులతో మాట్లాడారు. మంచి నీరు రాని ప్రాంతాలకు ప్రస్తుతానికి ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసే విధంగా చర్యలు చేపడతామన్నారు. గ్రామంలో ప్రజలు ఎక్కడపడితే అక్కడ చెత్త వేయరాదన్నారు. ఒకటి రెండుసార్లు చెబుతామని, తరువాత చట్టపరమైన చర్యలకు బాధ్యులవుతారని హెచ్చరించారు. ప్రధాన మురుగు కాల్వల ప్రక్షాళన చర్యలు తీసుకుంటున్నట్టు మునిసిపల్ కమీషనర్ ప్రభుదాసు పట్టణంలో అందేవారి బోదె, గంగానమ్మకోడు, మూలలంక బోదెలలో పేరుకుపోయిన మురుగును తొలగించి, మురుగునీటి ప్రవాహానికి చర్యలు చేపడతామన్నారు. అందేవారి బోదె, మూలలంక బోదెలకు కాంక్రీట్ గోడలు నిర్మించారన్నారు. మిగిలిన ప్రాంతాలలో మురుగునీటి ప్రవాహం నిలిచిపోవడంతో ఆధునీకరించిన ప్రాంతాల్లో లోపల సీల్డ్ పేరుకుపోతుందన్నారు. ప్రొక్లైన్ ద్వారా వీటిని తవ్విస్తామని చెప్పారు. ఆయా ప్రాంతాల్లో డ్రైయిన్లు పంచాయతీ సిబ్బందితో కలిసి కమీషనర్ పరిశీలించారు.