Date : 24-02-2020 #akividu #akividunews
కొల్లేటి పెద్దింట్లమ్మ తల్లి జాతర ఉత్సావాలు ప్రారంభం
నేటి నుంచి ఉత్సావాలు ప్రారంభం
మార్చి 6న జలదుర్గ-గోకర్నేశ్వరస్వామి వార్ల కళ్యాణం
కొల్లేరు సరసు మధ్యలో పెద్దింట్లమ్మ ఆలయం
మార్చి 6న కళ్యాణం
కొల్లేటి పెద్దింట్లమ్మ తల్లి జాతర ఉత్సావాలు ప్రారంభం
నేటి నుంచి ఉత్సావాలు ప్రారంభం
మార్చి 6న జలదుర్గ-గోకర్నేశ్వరస్వామి వార్ల కళ్యాణం
ఆకివీడు గ్రామీణ : కొల్లేటికోట గ్రామంలో కొలువైన పెద్దింట్లమ్మ జాతర మహోత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు బారి ఏర్పాట్లు చేసారు. ఈ నెల 24 నుంచి మార్చి 9వ తేదీ వరకు 15 రోజులపాటు నిర్వహించే ఈ ఉత్సావాలకు లక్షల మంది తరలివస్తారు. ఇందుకు అనుగుణంగా అవసరమైన అన్ని ఏర్పాట్లు అధికారులు, ఉత్సావా కమిటీ సభ్యులు సమన్వయంతో పూర్తి చేసారు.
కొల్లేరు సరసు మధ్యలో పెద్దింట్లమ్మ ఆలయం
రాష్ట్రంలో అతి పెద్ద సహజ సిద్దమైన మంచి నీటి సరస్సు కొల్లేరు. ఇది కృష్ణ, పశ్చిమగోదావరి జిల్లాల సరిహద్దు ప్రాంతంగా ఉంది. దక్షిణ కాశ్మీరంగా పేరొందిన కొల్లేరు సరస్సు మధ్యలో కొల్లేటికోట ఉంది. ఇక్కడ కొలువై ఉన్న పెద్దింట్లమ్మను స్థానిక ముత్స్యకారులు తమ కుల దైవంగా కొలుస్తారు. ఈ ఆలయంలో జలదుర్గా అమ్మవారి విగ్రహం కూడా ఉంది. తొమ్మిది అడుగుల ఎత్తు కలిగిన వీసాల నేత్రాలతో పద్మాసన భంగిమలో ఉన్న పెద్దింట్లమ్మ పార్వతీదేవి ప్రతి రూపం మహిమ గల అమ్మగా, పెద్దమ్మగా భక్తులు భక్తిశ్రద్దలతో పూజిస్తారు.
మార్చి 6న కళ్యాణం
కొల్లేటి పెద్దింట్లమ్మ జాతర ఉత్సావాల్లో భాగంగా మార్చి 6వ తేదీన జాలదుర్గ - గోకర్నేశ్వరస్వామి వార్ల కళ్యాణం వైభవంగా నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు ఆలయ కార్యనిర్వహణాధికారి కందుల వేణుగోపాలరావు చెప్పారు.