ఆకివీడు కమిషనర్ గా కే. ప్రభుదాసు
Date : 02-02-2020
Date : 02-02-2020
ఆకివీడు : ఆకివీడు నగర పంచాయతీ గా ఏర్పడిన రోజునే ఆకివీడు కమిషనర్ గా కంచర్ల ప్రభుదాసు శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఆకివీడు నగర పంచాయతీ గా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఏలూరు నగర పాలకసంస్థ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న ప్రభుదాసుకు ఆకివీడు నగర పంచాయతీ కమిషనర్ గా బాధ్యతలు అప్పగించారు. ఆకివీడు పట్టణ అభివృద్ధికి, ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రజలందరికి అందేలా చర్యలు తీసుకుంటానని ప్రభుదాసు చెప్పారు.