నగర పంచాయతీగా ఆకివీడు
Date : 01-02-2020
ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
రెండు దశాబ్దల కల నెరవేరింది
జీవో1 జీవో2
ఆకివీడు ప్రత్యేకతలు :
Date : 01-02-2020
ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
రెండు దశాబ్దల కల నెరవేరింది
జీవో1 జీవో2
ఆకివీడు : ఆకివీడు గ్రామా ప్రజల రెండు దశాబ్దల కల నెమరవేరింది. ఆకివీడు గ్రామా పంచాయతీ ని నగర పంచాయతీగా మార్చుతూ పభుత్వం జీవో విడుదల చేసింది. ఆకివీడు పంచాయతీ స్థాయి పెంపుపై ఆకివీడు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 1919 లో ఏర్పాటైన ఆకివీడు గ్రామా పంచాయతీ దినదినాభివృద్ధి చెందుతూ 20 వార్డులు, 8 ఎంపీటీసీలు కలిగి 26 వేల మంది ఓటర్లతో 40 వేల మంది జనాభా కలిగి ఉంది. రెండు దశాబ్దలుగా జిల్లా లోనే మేజర్ పంచాయతీగా ఉన్న ఆకివీడు ను నగర పంచాయతీగా చెయ్యాలని కోరగా నేటికీ ఆకివీడు ప్రజల కోరిక నెరవేరింది. నగర పంచాయతిగా మారడంవల్ల గ్రామంలో మరిన్ని మౌలిక సదుపాయాలు పెరుగుతాయని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆకివీడు నగర పంచాయతీగా మారడానికి ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి గారు మరియు మునిసిపల్ శాఖ మంత్రి బొత్సా సత్యనారాయణ, మంత్రి చెరుకువాడ శ్రీ రంగనాధరాజు, ఎంపీ కనుమూరి రఘురామా కృష్ణంరాజు, నియోజకవర్గ కన్వీనర్ పీవీల్ నరసింహరాజు కు కృతజ్ఞతలు తెలుపుస్తున్నామని రురల్ బ్యాంక్ చైర్మన్ కేశిరెడ్డి మురళి తెలిపారు.
ఆకివీడు ప్రత్యేకతలు :
కృష్ణ జిల్లా సరిహద్దు.
కొల్లేరుకు ముఖ ద్వారం.
రాష్ట్రంలోనే ప్రసిద్ధి చెందిన చేపల మార్కెట్.
ఎగుమతులు , దిగుమతులు.
ఒకప్పుడు రాష్ట్రంలోనే అత్యధిక రైస్ మిల్లులు.
వేదం పండితుల ప్రాంతంగా విరాజిల్లింది.