శాంతినగర్ డ్రైయిన్ కి మోక్షం
Date : 24-DEC-2019
Date : 24-DEC-2019
ఆకివీడు : శాంతినగర్ లో దీర్ఘకాలికంగా అద్వానంగా ఉన్న డ్రైయినేజి సమస్యకు మోక్షం కల్పిస్తూ సోమవారం అయన భూమిపూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా పివిఎల్ నరసింహ రాజు మాట్లాడుతూ గత ప్రభుత్వం లో అభివృద్ధి పనులకు టెంకాయలు కొట్టి చేతులు దులుపుకునే నైజాం మాది కాదని, అభివృద్ధి పనులను ప్రారంభించామంటే పని పూర్తి చేస్తామని వైసీపీ నియోజకవర్గ ఇంచార్జి పివిఎల్ నరసింహ రాజు స్పష్టం చేసారు. రాష్ట్ర ఖజానాలో డబ్బులు లేకపోయినా అభివృద్ధి పనులకు ఆటంకం లేకుండా నిధులు కేటాయంపు జరిగిందని చెప్పారు. గ్రామా సచివాలయాకు, రహదారులు, పక్క డ్రైయిన్ నిర్మాణానికి నియోజకవర్గానికి రూ.70 కోట్లు కేటాయించారని చెప్పారు. అత్యవసరమైన పనులు ఇంకా ఉన్న వాటికీ నిధుల కొరత లేదని చెప్పారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్లే శాంతినగర్ లో రోడ్ల, డ్రైయిన్ సమస్యలతో ఇక్కడి ప్రజలు విసిగిపోయారని ఆవేదన వ్యక్తం చేసారు. లక్షల నిధులు వినియోగించిన సమస్య ఫలితం దక్కలేదని ఆరోపించారు. శాంతి నగర్ లో ప్రజల సమస్యను స్థానిక నాయకులూ సిద్ధిక్, ఉప్పాడ రామారావు, ఎస్. కోటేశ్వరరావు, మండల ప్రధాన కార్యదర్శి జమ్మి శ్రీనివాస్, పట్టణ కమిటీ అధ్యక్షుడు శిరపు శ్రీనివాస్ తన దృష్టికి తీసుకువచ్చారని చెప్పారు. సమస్య త్రీవ్రత దృష్టిలో పెట్టుకుని ముందుగా పక్క డ్రైయినే నిర్మాణానికి భూమి పూజ చేస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో శాంతినగర్ ప్రజలు మరియు వైయస్ఆర్ సీపీ పార్టీ కార్యకర్తలు, వాలంటీర్ లు పాల్గొన్నారు.