ఆకివీడు : భీమవరం జోన్ స్థాయి క్రీడా పోటీల్లో ఆకివీడు జెడ్పి ఉన్నత పాఠశాల విద్యార్థులు ఓవరాల్ చాంఫియన్ షిప్ సాధించారని ప్రధానోపాధ్యారాలు కాకర్ల రాజేశ్వరి తెలిపారు. ఇటీవల శృంగవృక్షంలో జరిగిన క్రీడా పోటీల్లో చాంఫియన్ షిప్ సాధించిన విద్యార్థులను గురువారం పాఠశాల ఆవరణంలో అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చదువులతో పాటు క్రీడలో అత్యంత ప్రతిభ సాధిస్తున్నారని చెప్పారు. జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీల్లో పలు పతకాలు సాధించారని తెలిపారు. సీనియర్ స్థాయిలో రన్నింగ్, లాంగ్ జంప్, హై జంప్, విభాగాల్లో ఎన్. శ్రీను జోనల్ స్థాయిలో వ్యక్తిగత చాంపియన్ సాధించారన్నారు. జూనియర్ విభాగంలో 200, 400, 800 మీటర్ల పరుగు పందెం, లాంగ్ జంప్ లో బి. మౌళి వ్యక్తిగత చాంపియన్ గా నిలిచాడు. సీనియర్స్ 1500 మీటర్ల రన్నింగ్ లో లోకేష్ , డిస్కస్ త్రోలో మొహిద్దీన్ తృతీయస్థానం, జావెలిన్ త్రో లో ఇజ్రాయెల్ ప్రధమ, శాంతివర్ధన్ తృతీయ స్థానాలు సాధించారన్నారు.