Date :05-11-2019
ఆకివీడు : స్థానిక స్టేషన్ రోడ్డులోని శ్మశానవాటిక అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయి. దాతల విరాళాలతో దహనసంస్కరణలకు రెండు భవనాలు నిర్మిస్తున్నారు. శివలింగం ఏర్పాటు, మొక్కల పెంపకం, పార్కుని తలపించే విధంగా పూల తోటలను పెంచేందుకు నిర్వాహకులు ప్రణాళిక రూపొందించి పనులు వేగంగా చేయిస్తున్నారు. రెండు నెలలకితం YSRCP ఉండి సమన్వయకర్త పి.వీ.ఎల్ నరసింహరాజు చేతులమీదగా భూమి పూజా జరిగింది. ప్రస్తుతం ప్రహరీ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. దాతల సహకారంతో స్థానిక వైసీపీ పట్టణ అద్యక్షుడు శిరపు శ్రీను, ల్యాండ్ లార్డ్ జంపన సుబ్రహ్మణ్యరాజు, వంటపాటి శంకర్ ల పర్యవేక్షణలో పనులు జరుగుతున్నాయి. జనవరి నాటికీ పనులు పూర్తి చేసి, ప్రారంభించాలని యోచిస్తున్నట్టు వారు తెలిపారు.
రుద్రభూమి నమూనా
రుద్రభూమి నమూనా