Date:19-NOV-2019
ఆకివీడు: స్థానిక గంగానమ్మకోడు ప్రాంతాల్లో నివసిస్తున్న చింతా నాగరాజు, మేకల నాగరాజు నకిలీ బంగారం విక్రయించి రూ.4లక్షలు దోచుకున్నారని చిత్తూరు జిల్లా రామసముద్రం మండలం మిట్టుపల్లి గ్రామానికి చెందిన ఆవుల మల్లికార్జునరావు సోమవారం పోలీసులకు పిర్యాదు చేసాడు. ఎస్సై వీరభద్రరావు కథనం ప్రకారం మల్లికార్జునరావు కుటుంబ సభ్యులతో కలిసి ఈ నెల 10న తిరుపతి కొండకు వెళ్ళాడు. అక్కడ చింత నాగరాజు, మేకల నాగరాజు పరిచయం అయ్యారు. తమ వద్ద బంగారం ముద్ద ఉందని నమ్మించారు. తక్కువ ధరకే ఇస్తామని ఆశ చూపారు ఆకివీడు రావాలని కోరారు. వీరి మాటలు నమ్మిన మల్లికార్జునరావు ఈ నెల 14 న ఆకివీడు వచ్చాడు. తొలుత శ్యాంపిల్ బంగారు ముక్క ఇచ్చారు దానిని తీసుకుని స్వగ్రామం వెళ్లిన మల్లికార్జునరావు పరీక్ష చేయించుకోగా నకిలీ బంగారం అని తేలింది. దింతో తన సొమ్ము తనకు తిరిగి ఇవ్వాలని బతిమాలిన ఇవ్వడంలేదని మల్లికార్జునరావు ఆవేదన వ్యక్తం చేసాడు. బాధితుడి పిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తునట్లు ఎస్సై చెప్పారు.