ఆకివీడు, 16 అక్టోబర్ 19: రాష్ట్రస్థాయి ఫుట్ బాల్, హ్యాండ్ బాల్ పోటీల్లో ఆకివీడు PLSZP హైస్కూల్ లో విద్యార్థులు ఎస్. మహేష్, చీమల చందు లు సిల్వర్ మెడల్ సాధించినట్లు ఎచ్ఎం కాకర్ల రాజేశ్వరి చెప్పారు. ఈ నెల 13, 14 తేదీల్లో చిత్తూరు జిల్లా రామగిరి ప్రభుత్వం ఉన్నత పాఠశాలలో జరిగిన రాష్ట్రస్థాయి ఫుట్ బాల్, హ్యాండ్ బాల్ పోటీలల్లో జిల్లా జట్టు తరుపున తమ విద్యార్థులు వెళ్లారని చెప్పారు. విజేతలను పాఠశాల ఆవరణంలో మంగళవారం అభినందించారు.