ఆకివీడు, 09 సెప్టెంబర్ 2019 : ప్రధాన సెంటర్ లో దొరగారి చెరువు త్వరలోనే పూడిక తొలగించి మంచినీటీ చెరువుగా అభివృద్ధికి కావలసిన అంచనాలు తయారు చేసేందుకు శనివారం RWAS డీఈఈ , ఏఈఈ లు సర్వే చేసారు. అనంతరం కేశిరెడ్డి మురళి మాట్లాడుతూ గత కొన్నేళ్లుగా పాలకుల నిర్లక్ష్యం వాళ్ళ చెరువు పూడిక తొలగింపునకు నోచుకోక పనికిరాకుండా పోయిందన్నారు. చెరువు తవ్వకం పనులు చేపట్టి చుట్టూ వాకింగ్ మార్గం ఏర్పాటు చేసి, ఆహ్లాదకరమైన వాతావరణం తీసుకొచ్చేందుకు వైసీపీ నియోజకవర్గం ఇన్ ఛార్జ్ పీవీల్ నరసింహరాజు చర్యలు చేపట్టారన్నారు. దానిలో భాగంగా సర్వే చేస్తున్నామన్నారు. ఆక్రమణ దారులు చెరువు ప్రాంతంలోకి మురుగు వాడకం నీరు వదలకుండా చూసుకోవాలన్నారు. చెరువును శుభ్రం చేయిస్తే ఈ ప్రాంతం వాసులకు నీటి కష్టాలు తీరుతాయన్నారు.