ఆకివీడు, జూలై 11 : రైల్వే డబ్లింగ్ పనుల్లో భాగంగా గురువారం నుంచి మొదటి ఫ్లాట్ ఫాం కు రైళ్ల రాకపోకలుండవని రైల్వే స్టేషన్మే మేనేజర్ మాణిక్యం అన్నారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గురువారం నుంచి స్థానిక స్టేషన్ దగ్గర నుంచి మొదటి ఫ్లాట్ ఫాం పనులు జరుగుతుండడంతో రైల్వే స్టేషన్ కు వచ్చి వెళ్లే రైళ్లన్నీ రెండు / మూడు ఫ్లాట్ ఫాం వద్దకు వచ్చి వెళతాయన్నారు. మొదటి ఫ్లాట్ఫాం ఫైకి ఆగస్టు మొదటి వారంలో మళ్లీ రాకపోకలు జరుగుతాయన్నారు. ఈ విషయం ప్రయాణికులు గుర్తించి సహకరించాలన్నారు.