*జిల్లాలో 3 నగర పంచాయతీలకు గ్రీన్ సిగ్నెల్
*ఆకివీడు, అత్తిలి , చింతలపూడికి దక్కిన గౌరవం
*చారిత్రత్మక నిర్ణయం తీసుకున్న జగన్ ప్రభుత్వం
*ఇక అభివృద్ధి దిశగా పరుగులు
ఆకివీడు, జులై 25 : కొల్లేరుకు ముఖద్వారంగా ఉన్న ఆకివీడును ఇప్పుడు నగర పంచాయతీ చేసేందుకు రంగం సిద్ధమైంది. త్వరలోనే నగర పంచాయతీగా ఏర్పడనుంది. ఇందుకు కావలసిన జనాభా, విస్తీర్ణం, సౌకర్యాలు, నిండుగా ఉండడంతో అభివృద్ధి త్వరితగతిన జరిగే అవకాశాలున్నాయి. పదేళ్లు మేజర్ పంచాయతీ ఉన్న ఆకివీడును నగర పంచాయతీగా అభివృద్ధి పరచాలని పలుమార్లు పంచాయతీ తీర్మానం చేసింది. తీర్మానాలన్నీ గత ప్రభుత్వాలు బుట్టదాఖలు చేసింది. ప్రస్తుతం ముఖ్యమంత్రి వైస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభత్వం ప్రజల కల నెరవెర్చే దిశగా నగర పంచాయతిల ఏర్పాటుకు అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే మున్సిపాలిటీ స్థాయికి తగ్గట్టుగానే ఆకివీడు ప్రజల జీవనశైలి ఉంది. పంచాయతీని నగర, మున్సిపాలిటీ స్థాయి కల్పించాలని ప్రజలు, నాయకులు, ప్రజాప్రతినిదులు గత కొంతకాలంగా పాలకుల్ని వేడుకుంటున్నారు. నగర పంచాయతీగా ఏర్పడితే రహదారులు, డ్రైయిన్లు, విద్య, ఆరోగ్యం, మంచినీరు, తదితర సౌకర్యాలు మరింతగా అభివృద్ధి చెందుతాయని చెబుతున్నారు. పన్నులు రేట్లు పెరిగిన కేంద్ర ప్రభుత్వం, పలు సంస్థల నుంచి గ్రాంట్లు అధికంగా వస్తాయంటున్నారు.
జనాభాలో ముందజం :
ప్రస్తుతం ఆకివీడు మేజర్ పంచాయతీ 37,600 జనాభాతో 20 వార్డులతో ఉంది. గ్రామంలో వ్యవసాయ సాగు భూమి 2,030 ఎకరాలు. చేపలు, రొయ్యల చెరువులు 2,680 ఎకరాల్లో ఉన్నాయి. మండల కేంద్రంగా ఉన్న ఆకివీడులో మంచినీటి చెరువులు 16, రక్షిత మంచినీటి పథకాలు 6, జెడ్పీ ఉన్నత పాఠశాలలు 2, మండల పరిషత్ పాఠశాలలు 13, ఎయిడెడ్ స్కూళ్ళు 3 ఉన్నాయి. వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉంది.
దర్శనియ్య స్థలాలు :
ఆకివీడు సరిహద్దు గ్రామాల్లో దర్శనియ్య స్థలాలు, పుణ్యక్షేత్రాలున్నాయి. గ్రామా దేవతగా ఉన్న పెద్దింట్లమ్మవారు , గంగానమ్మ మద్దిరాలమ్మ వార్ల జాతర్లు, ఏటా వైభవంగా నిర్వహిస్తారు. మాదివాడలోని వేంకటేశ్వరస్వామి, మల్లేశ్వరస్వామి, ఆలయాలు, రాజేశ్వరి సహిత మార్కండేయేశ్వర స్వామి ఆలయం, అగ్రహారం లోని శివాలయం, వేణుగోపాలస్వామి, భీమేశ్వరస్వామి ఆలయాలు ఎంతో ప్రసిద్ధిచెందయి. అయిభీమవరంలోని వేద పాఠశాల , మదన గోపాలస్వామి ఆలయం, దుంపగడపలోని వరదరాజస్వామి దేవాలయం ఎంతో ప్రసిద్ధి చెందాయి.
నగర పంచాయతీలో మరికొన్ని గ్రామాలూ :
ఆకివీడు నగర పంచాయతీలో మరి కొన్ని గ్రామాలూ విలీనమయ్యే అవకాశాలున్నాయంటున్నారు. ఆకివీడుకు చేర్చి ఉన్న అజ్జమూరు, కుప్పనపూడి, అయిభీమవరం, దుంపగడప గ్రామాలన్నీ విలీనం చేసే అవకాశం ఉందంటూన్నారు. ఆయా గ్రామాలను విలీనం చెయకుండానే ఆకివీడు ప్రస్తుత జనాభాతో నగర పంచాయతీగా ఏర్పడే ఆవకాశం ఉంది. సరిహద్దు గ్రామాలను విలీనంచేస్తే మున్సిపాలిటీ స్థాయి వచ్చే అవకాశం ఉంది.