* రోహిణి కార్తెను తలపిస్తున్న మృగశిర కార్తె ఎండలు
* ప్రధాన రోడ్లు నిర్మానుష్యం
ఆకివీడు - జూన్ 13 : మృగశిర కార్తె తరువాత కూడా ఎండలు రోహిణి కార్తె ఎండలను తలషిస్తుండంతో ప్రజానీకం బెంబేలెత్తుతున్నారు. భానుడి భగభగ అధికమయ్యాయి.ఎండల దాటికి ప్రజలు అల్లాడుతున్నారు. ప్రధాన రోడ్లు ఉదయం 11 గంటల నుంచే నిర్మానుష్యంగా మారుతున్నాయి. చిన్నారులు,వృద్దుల బాధలు వర్ణనా తీతం అత్యసవర సమయాల్లో బయటకు వెళ్లాలంటే ముఖానికి క్లాత్, కళ్లేజోళ్ళు ధరించి వెళుతున్నారు.వైద్యుల సూచనల మేరకు తణుం జాగ్రత్తలు తీసుకోవాలని సాధ్యమైనంత వరకు ఎండ వేడిమి తగలకుండా ఉదయం సాయంత్రం సమయంలో పనులు ముగించుకుని ఇళ్లకు చేరుకోవాలని సూచిస్తూన్నారు.