* పండంటి బిడ్డకు జన్మనిచ్చిన గర్భిణీ
* ఎల్‌టీటీ ఎక్స్‌ప్రెస్‌లో ఆకివీడు వద్ద ఘటన
* ఎల్‌టీటీ ఎక్స్‌ప్రెస్‌లో ఆకివీడు వద్ద ఘటన
ఆకివీడు:మే17, గర్భిణీ రైలులో ప్రసవించిన ఘటన ఇది. బుధవారం రాత్రి హైదరాబాద్ నుంచి ఎల్‌టీటీ ఎక్స్‌ప్రెస్‌లో ఆర్.రేవతి అనే 7 నెలల గర్భిణీ పుట్టింటికి పిఠాపురం వెళ్లేందుకు సామర్లకోట స్టేషన్‌కు వరకు రిజర్వేషన్ చేయించుకుని బయలుదేరారు. రైలు గురువారం ఉదయం ఆకివీడు సమీపంలోకి వచ్చే సరికి పురిటినొప్పులు రావడంతో బందువులు కంగారుపడ్డారు. అయితే ఆమె రైలులోనే పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో బందువులు, ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. రైలు ఆకివీడు చేరుకున్న తర్వాత అమెను, బిడ్డను 108 వాహనంలో స్ధానిక పీహెచ్ సి తరలించారు. వైద్యులు అమెకు వైద్యం అందించి సంపూర్ణ ఆరోగ్యంతో వారిని పిఠాపురం పంపించారు.