ప్రజాధనం వృథా
పట్టించుకోని అధికారులు
ఆకివీడు, మే 15 : గ్రామంలో ప్రమాదాలు నివారించడానికి ప్రభుత్వ నిధులతో కొనుగోలు చేసిన బస్‌బేస్ లు నిరుపయోగంగా పడి ఉన్నాయి, మునిసిపాలిటీ స్ధాయికి ఎదిగిన ఆకివీడు గ్రామంలో జాతీయ రహదారి విస్తరణ జరగకపోవడంతో జానకన్ము హాస్పిటల్ నుంచి FCI వరకూ తరచూ ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతోంది. దీంతో పలు ప్రమాదాలు జరుగుతుండడంతో ప్రజలు ప్రాణాలు కోల్ఫోతున్నారు, ప్రమాదాలను నివారించడానికి కొనుగోలు చేసిన బస్‌బేస్లు ప్రయాణీకులు, ప్రజలు గుర్తించేందుకు రంగులు వేయించారు, ప్రమాదాలు కొంతమేర నివారించడానికి ప్రభుత్వ జనరల్ నిధులతో కొనుగోలు చేసిన బస్‌బేస్లు గుమ్ములూరు సెంటర్, పాత బస్టాండ్, కైకలూరు వెళ్తే బస్టాప్ ప్రాంతాల్లో గతేడాది ఏప్రిల్ లో ఏర్పాటు చేశారు, ఏడాది తిరగక ముందే బస్‌బేస్లు నిరుపయోగంగా మారాయి, వాటిని సరైన స్థానంలో ఏర్పాటు చేయలేదు, రోడ్లు పక్కన నిరుపయోగంగా పడి ఉన్నాయి, అధికారులు ఛోద్యం చూస్తున్నారని పలువురు బహిరంగంగానే విమర్శిస్తున్నారు.