డెల్టా వాసుల చిరుకాల వాంఛ మరో రెండు నెలల్లో నెరవేరనుంది. దశాబ్దాలుగా విజయవాడ- నరసాపురంల మధ్య డబ్లింగ్ రైల్వేలైన్ కోసం చూసిన ఎదురుచూపులు త్వరలో సఫలం కానున్నాయి, తొలి విడతగా ౩2 కిలోమీటర్త మేర కొత్తలైన్లో రైళ్ళను అనుమతించాలని రైల్వేశాఖ అధికారులు నిర్ణయించారు, ఇప్పటికే ఆకివీడు కృష్ణా జిల్లా మోటూరు మధ్య పూర్తయి డబ్లింగ్ రైల్వేలైన్లో ట్రయల్ రన్ కూడా నిర్వహించారు, ఇది విజయవంతం కావడంతో జాన్ నెలలో పూర్తయిన మార్గంలో రైళ్ళను నడిపేందుకు సన్నద్ధమవుతున్నారు, ఇది అమలైతే ఈ మార్గంలో రైల్వే క్రాసింగ్ బెడద తప్పనుంది, చాలా రైళ్లు గంట నుంచి అరగంట ముందుగా గమ్య స్థానాలకు చేరుకుంటాయని రైల్వే అధికారులు అంచనా వేస్తున్నారు, విజయవాడ- నరసాపురం మధ్య డబ్లింగ్ లైన్ కోసం డెల్టా వాసులు అనేక పోరాటాలు చేశారు, 1948లో అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం ఈ మార్గంలో రైల్వేలైన్ నిర్మించింది. స్వాతంత్య్రం వచ్చిన తరువాత 1962లో ఈ మార్గాన్ని మీటర్ గ్రేజ్ నుంచి బ్రాడ్ గ్రేజ్‌గా మార్చారు. గడిచిన ఆరు దశాబ్ధాల కాలంలో ఈ మార్గంలో రైళ్ల రాకపోకల సంఖ్య విపరీతంగా పెరిగింది, అయితే దానికి అనుగుణంగా అదనపు రైల్వే ట్రాక్ నిర్మాణ పనులు చేపట్టకపోవడం వల్ల అడుగడుగునా క్రాసింగ్ బెడద వెంటాడుతూ వచ్చింది. 132 కిలోమీటర్ల ప్రయాణానికి నాలుగు నుంచి ఐదు గంటల సమయం పడుతుంది, దీని వల్ల రైళ్ల రాకపోకలు ఆలస్యంతో పాటు ప్రయాణికులు కూడా ఈ మార్గంలో ప్రయాణంమంటే భయపడవలసిన పరిస్తితి ఏర్పడింది. పెరిగిన ట్రాఫిక్‌ను పరిగణలోకి తీసుకుని డబ్లింగ్ లైన్ నిర్మించాలని అనేక ఉద్యమాలు, పోరాటాలు చేశారు, ఎట్టకేలకు 2013లో ఈ ప్రాజెక్టుకు రైల్వేశాఖ ఆమోద ముద్ర వేసింది. ఐదు విభాగాలుగా పనులు చేపట్టారు. అందులో విజయవాడ-గుడివాడ, గుడివాడ-మచిలీపట్నం' గుడివాడ-భీమవరం, నరసాపురం-భీమవరం, నిడదవోలు-భీమవరం ఇలా విభాగాలుగా విభజించి టెండర్లు పిలిచారు.
గత ఆర్నెల్లుగా జరుగుతున్న పనుల్లో ఇప్పటి వరకు గుడివాడ-ఆకివీడు మధ్య చేపట్టిన పనులు పూర్తయ్యాయి. అయితే మోటూరు-గుడివాడ మధ్య ఇంకా కొద్దిగా పెండింగ్ ఉంది, అలాగే ఆకివీడు- భీమవరం మధ్య 80శాతం మాత్రమే పని పూర్తయింది. కానీ ఆకివీడు నుంచి మోటూరు వరకు చేపట్టిన పనులు వంతెన నిర్మాణాలు పూర్తయ్యాయి. 32 కిలోమీటర్ల మేర డబ్లింగ్ లైన్ పూర్తికావడంతో గత నెలలో రైల్వే అధికారులు ట్రయల్ రన్ కూడా నిర్వహించారు, ఇందులో ప్రధానంగా ఆకివీడు వద్దనున్న ఉప్పుటేరుపై 800మీటర్త మేర బారి వంతెన నిర్మించారు, ఈపనులు ఫూర్తికావడంతో వంతెనపై మూడు సార్లు ట్రయల్ రన్ కూడా చేశారు, అంతా విజయవంతం కావడంతో ఈ మార్గంలో రాకపోకలకు అనుమతించాలని నిర్ణయించారు, జూన్ నెలలో ప్రారంభించేందుకు రెడీ అవుతున్నారు.
విజయవాడ-భీమవరం-నిడదవోలు-నరసాపురంల మధ్య ఈ మార్గంలో అత్యదికంగా రైళ్లు నడుస్తున్నాయి, ఉదయం, సాయంత్ర సమయంలోనే ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది. అది కూడా గుడివాడ - భీమవరం మధ్యే ఎక్కువుగా క్రాసింగ్ల్ ఉంటున్నాయి. ఈ కారణంగా రైళ్లు సకాలంలో గమ్య స్థానాలకు చేరడం లేదు, ప్రస్తుతం ఈ మార్గంలో రాకపోకలకు అనుమతిస్తే, ఇక క్రాసింగ్ల బెడద తప్పినట్లే, షెడ్యూల్ సమయానికి కంటే అరగంట నుంచి గంట ముందుగా గమ్య స్థానానికి చేరుకునే అవకాశం ఉంటుందని రైల్వే అధికారులు భావిస్తున్నారు, మొత్తం ప్రాజెక్టు పూర్తికావడానికి మరో ఏడాదిన్నర సమయం పట్టే అవకాశం ఉంది, ఈ లోపున పూర్తయిన మార్గాల్లో రాకపోకలకు అనుమతిచుకుంటూ పోవాలని నిర్ణయించారు, దానిలో బాగంగానే తొలి విడతగా 32 కిలోమీటర్లు మేర డబుల్‌లైన్ కు పచ్చ జెండా ఊపారు.