ఆకివీడు: బైపాస్ రోడ్డును ఫూర్తిస్ధాయిలో వినియోగంలోకి తీసుకువచ్చేందుకు అన్ని చర్యలూ తీసుకుంటున్నట్టు ఎమ్మెల్యే వేటుకూరి శివరామరాజు చెప్పారు. బైపాస్ రోడ్డు ప్రాంతాన్ని బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకరులతో ఆయన మాట్లాడుతూ వెంకయ్య వయ్యేరు కాలువకు రూ.20 కోట్లతో వివిద ప్రాంతాల్లో రిటైనింగ్ వాల్స్ నిర్మాణం చేపడతామన్నారు.
ఆకివీడులోని జాతీయ రహదారి వంతెన వద్ద నుంచి సంతపేట ఫుట్ పాత్ వంతెన వరకూ టైనింగ్ వాల్స్ నిర్మిస్తామన్నారు. రోడ్డుకు అడ్డంగా ఉన్న విద్యుత్ స్థంభాల్ని తొలగించి, ఆదే ప్రాలతంలో ఉన్న సాయి మందిరాన్ని కూడా వేరే ప్రాంతానికి తరలిస్తామన్నారు. అయిభీమవరం రోడ్డు ముఖద్వారంలో ఉన్న విద్యుత్ స్థంభాన్ని తొలగించి రోడ్డు ముఖద్వారాన్ని వాహనాలకు ఇబ్బందిలేకుండా వెడల్పు చేస్తామన్నారు.