ఆకివీడు: నేనే కరెక్ట్... నాకు తిరుగులేదు.. నన్నెవరూ అడ్డుకోలేరు.. ఆ సూర్యుడు కూడా నా జోలికిరాదు అంటూ ఓ వృద్ధుడు తాటాకు గొడుగుతో మండుటెండను తెక్కజేయడం లేదు. ఆకివీడు మండలంలోని తాళ్లకోడు గ్రామానికి చెందిన 85 ఏళ్ల వృద్ధుడు మంగయ్య గతంలో తాను ఉపయోగించిన తాటాకు గొడుగును మళ్లీ ఇప్పుడు ఉపయోగిస్తున్నట్టు చెప్పారు.
ఈ గొడుగు ఎండ వేడికి తట్టుకుంటుందన్నారు. ఇప్పుడు వచ్చే గొడుగులు ఎండలో కరెగిపోతాయని చెప్పారు. తాటాకు గొడుగులు పాలకొల్లు వెళ్లి సంతలో కొనుగోలు చేసినట్టు చెప్పారు. ఎంత ఎండైన తగలకుండా చల్లదనాన్ని ఇస్తుందన్నారు. ఏది ఏమైనా గత రోజులే బాగున్నాయన్నారు.