* ఏడాది నుంచి తప్పని సమస్యలు
* వివేకానందనగర్ కాలనీ మహిళల ఆందోళన
ఆకివీడు : తాగడానికి గుక్కెడు నీళ్లు ఇప్పించాలని వివేకానందనగర్ కాలనీ మహిళలు వేడుకుంటున్నారు. కాలనీలో ఏడాది నుంచి మంచినీరు, వాడకపునీటి సమస్య ఉందని ప్రజా ప్రతినిధులు అధికారుల దృష్టికి అనేక సార్లు తీసుకెళ్ళినప్పటికీ పట్టించుకోవడంలేదు. 20వ వార్డులోని వివేకానందనగర్ కాలనీలో నీటి సమస్య ఉండడంతో ఎమ్మెల్యే కార్యాలయం, జడ్పి ఉపాధ్యక్షురాలు లలితాదేవి, ప్రత్యేకాధికారి అప్పటి నాగార్జునరెడ్డి, మీకోసంలో పలుమార్లు తెలియచేశామని చివరకు గత్యంతరం లేక కుటుంబానికి నెలకు 4 వేలు ఖర్చు చేసి తాగడానికి, వాడకానికి నీళ్లను కొనుగోలు చేనుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు కాలనీలో వాడకానికి బోరు చేయించుకుంటే ఉప్పునీరు వస్తుండడంతో ఆ నీటిని వినియోగించకుండా నెలకు కుటుంబానికి రెండు ప్రైవేట్ ట్యాంకుల నీటిని రప్పించుకుంటున్నామని మహిళలు వాపోతున్నారు. కాలనీలో ఉన్న మంచినీటి పైప్ లైన్కు దొర గారి చేరువు ట్యాంక్ నుంచి అందచెయ్యాల్సి ఉండగా నీరు అందకపోవడంతో సరఫరా చేయడం లేదు ఈ విషయం అధికారుల దృష్టికి తీసుకెళ్ళడంతో సమీపంలోని శాంతినగర్ ట్యాంక్ నుంచి సరఫరా చేస్తామని చెప్పి పది రోజులు చేసిన తరువాత సరఫరా చేయడం మానేశారన్నారు. రానున్నది వేసవికాలం కావడంతో పాలకుల,అధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలని కోరుచున్నారు.
పైప్‌లైన్ మరమ్మతులతో సమస్య ఏర్పడింది.
వివేకానంగనగర్ కాలనీకి సరఫరా చేసే మంచినీటి ఫైపులైన్ మరమ్మతులు పాలవ్వడం వల్ల సమస్య ఏర్పడిందని మరమ్మతులు చేయించాం తాగునీటి చెరువులో నీటిని మార్చుతున్నందున నీరు సరఫరా కాలేదు వెంటనే నీటిని అందచేస్తాం. ఏడాది నుంచి నీరు సక్రమంగా అందడంలేదు అనేది నిజం కాదు. ఠాగూర్, పంచాయతీ కార్యదర్శి