ఆకివీడు: విభిన్న ప్రతిభావంతులు కూడా ఓటు హక్కును వినియోగించుకునే విదంగా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని మండల సహాయ ఎన్నికల రిటర్నింగ్ అధికారి వెన్నెల శ్రీను చెప్పారు. స్ధానిక పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద విభిన్న ప్రతిభావాంతులకు ఓటు హక్కుపై అవగాహన సదస్సును సోమవారం నిర్వహించారు. అంధులకు ఓటింగ్ యంత్రంలో బ్రెయిలీ లిపితో ఓటు వేసుకునే అవకాశం ఉందన్నారు. సదస్సులో విభిన్న ప్రతిబావంతుల, వయోవృద్ధుల సంచాలకులు వి.ప్రసాదరావు మాట్లాడుతూ ఓటు హక్కు అందరూ వినియోగించుకోవాలన్నారు.దివ్యాంగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అల్లాడి నటరాజ్ మాట్లాడుతూ పోలింగ్ కేంద్రాల వద్ద రవాణా సౌకర్య౦, వీల్ చైర్లు ఏర్పాటు చేసారని తెలిపారు. ఈ సదస్సులో పలువురు అధికారులు పాల్గొన్నారు. అనంతరం పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద నుంచి దివంగత డాక్టర్ రఘునాధరాజు ఎస్ టర్నింగ్ వరకూ ర్యాలీ నిర్వహించారు.