* తరచూ ట్రాఫిక్‌కు అంతరాయం
* హైవేకి ఇరువైపులా ఆక్రమణలు
ఆకివీడు: వాహనాల నిలుపుదలకు పార్కింగ్‌లు లేకపోవడంతో రోడ్లపైనే వాహనాలు నిలుపుతుండడంతో ఆకివీడులో నిత్యం ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతుంది. డాక్టర్ రఘునారరాజు టర్నింగ్ (ఎస్ టర్నింగ్) సమీపంలోని ఆంధ్ర బ్యాంకు ఎదురుగా జాతీయరహదారిఫై మోటారు వాహనాలు పార్కింగ్ చేయడంతో బస్సులు, ఇతర వాహనాలు వెళ్లడానికి ఇబ్బందులు పడుతుండడంతో తరచూ ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడుతుంది. వాణి క్లాత్ షోరూమ్, కొప్పర్తి జ్యువెలరీ ఇలా ప్రతీ దుకాణం వద్ద మోటారు వాహనాలు జాతీయ రహదారికి అనుకుని పెడుతుందడంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడడమే కాకుండా ప్రజలు ప్రమాదాల బారిన పడుతున్నారు. ఆకివీడు గ్రామంలో స్థానిక జానకమ్మ ఆస్పత్రి నుంచి ఎవ్‌సీఐ వరకూ ఉదయం, సాయంత్రం వెళ్లాలంటే గంటల సమయం పడుతుంది జాతీయ రహదారికి ఇరువైపుల ఆక్రమణకు గురవ్వడమే కాకుండా, దుకాణదారులు రోడ్లపైన వ్యాపారాలు కొనసాగించడంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. జాతీయ రహదారి విస్తరించనంతకాలం గ్రామంలో ట్రాఫిక్ సమస్యలు తప్పవు అధికారులు, పాలకులు వెంటనే స్పందించి సమస్య పరిష్కరించాలని పలువురు కోరుకున్నారు.