ఆకివీడు: పేదలు ఆకలితో పస్తులుండకూడదనే ఉద్దేశంతో సీఎం చంద్రబాబు అన్న క్వాంటీన్లు ఏర్పాటు చేశారని ఏఎంసి చైర్మన్ మోటుపల్లి రామవర ప్రసాద్ అన్నారు. బుధవారం స్థానిక గాంధీజీ సెంటర్ (దొరగారి చెరువు) వద్ద అన్న క్యాంటీన్ ను ఆయన ప్రారంభించి పేదలకు అన్నం వడ్డించి మాట్లాడారు.
ఎమ్మెల్యే శివ కృషితో ఆకివీడుకు ఒక అన్న క్వాంటివ్‌ను తీసుకచ్చారని హోటల్లో ఇదే భోజనం రూ.60/- పైనే ఉంటుందని ఇక్కడ కేవలం రూ.5 లకే అన్నం, కూరలు, సాంబారు, పచ్చడి, పెరుగు, తాగునీరుతో అందచేస్తున్నాం అన్నారు. పేదలు దీనిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గొంట్లా గణపతి, టీడీపీ పట్నం అధ్యక్షుడు బోళ్ల వెంకట్రావు, ఎంపీడీవో ప్రభాకర్, పంచాయతీ కార్యదర్శి ఠాగూర్, టీడీపీ నేతలు తదితరులు ఉన్నారు.