ఆకివీడు: నిషేదిత ప్లాస్టిక్ సంచులు, వస్తువుల వినియోగం రాన్రాను పెరుగుతోంది. పట్టణాలు - పల్లెలు అనేతేడా లేకుండా ప్రతి దానికి ప్లాస్టిక్ నే వాడుతున్నారు చల్లని, వేడి ఘన ద్రవ పదార్దాలతో పాటు కొబ్బరి నీళ్లను సైతం నింపేసి విక్రయిస్తున్నారు. వీటిల్లో తీసుకెళ్లిన పౌష్టికాహారం వల్ల ఆరోగ్యం సంగతి దేవుడెరుగు. ప్లాస్టిక్ అవశేషాలు శరీరంలోకి చేరుతున్నాయని పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేస్తూన్నారు. తాజాగా సముద్రపు ఆహారంలో పాటు. ప్యాక్ చేసిన ఆహారం వల్ల మైక్రో ప్లాస్టిక్ అవశేషాలు మానవుడి దేహంలోకి ప్రవేశిస్తున్నట్టు తేల్చారు. 10 గ్రాముల మలంలో దాదాపు 20 మైక్రో ప్లాస్టిక్ అవశేషాలు ఉంటాయని గుర్తించారు. ఆ వాడిన వాటిని పంట, మురుగు కాలువల్లో పారవేయడం ద్వారా నీటి పారుదలకు అవరోధంగా మారింది. దీంతో రైతులు ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. అలాగే పర్యవరణానికి తీవ్ర నష్టం వాటిల్లుతోంది. నిషేదిత ప్లాస్టిక్ ఉత్పత్తులను విక్రయించకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని పర్యావరణవేత్తలు, ప్రజలు కోరుతునా న్నారు.