* ఆకట్టుకుంటున్నచిట్టి గీసిన చిత్రాలు
* జాతీయ స్థాయి పోటీల్లో 18 అవార్దులు కైవసం
ఆయన చేతి నుంచి జాలు వారిన చిత్రలెన్నో అవార్డులు తీనుకౌచ్చాయి ఆకివీడు మండలం అయి భీమవరం గ్రామంలో డ్రాయింగ్ మాస్టారుగా పనిచేస్తున్న చిట్టి చిన్నప్పటి నుంచి డ్రాయింగ్ పై ఉన్న ఆసక్తిని పెంచుకున్నారు తన స్వగ్రామమైన చేరుకుమిల్లి గ్రామంలోని జడ్పి ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న డ్రాయింగ్ మాస్టారు పట్నాల భాస్కరరావు వద్ద చిత్రలేఖనం నేర్చుకున్నారు.
అనంతరం భీమవరంలో మరో ఉపాధ్యాయుడు కె.వాసు వద్ద పూర్తి స్థాయిలో మెళకువలు నేర్చుకున్నారు. డిప్లొమా ఇన్ ఆర్ట్స్ మద్రాసు ప్రభుత్వం వారు నిర్వహించే పరీక్షల్లో పట్టా పొందారు. ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించే లోయర్, హైయ్యర్ పరీక్షల్లో సైతం పట్టా సాధించారు.
ఆయిల్, వాటర్ గ్లాస్ డిజైనింగ్ లో డ్రాయింగ్ చేస్తున్నట్టు తెలిపారు, జాతీయ స్ధాయి డ్రాయింగ్ పోటీల్లో అనేక బహుమతులు సాధించారు, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం చేతుల మీదుగా అవార్డు తీసుకోవడం తన జీవితంలో మరువలేనిదని చెబుతారు.
అమలాపురం వారి కోనసీమ చిత్ర కళాపరిషత్, వైజాగ్ వారి లలితా కళాపరిషత్, భద్రాచలం వారు నిర్వహించే జాతీయ పోటీల్లో 18 అవార్డులు సాధించారు, విద్యార్థులతో జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో 15 బహుమతులు సాధించారు పలువురు విద్యార్ధులకు ఈ కళ గొప్పతనాన్ని వివరిస్తూ వారిలో ఆసక్తిని పెంచుతున్నారు.
150 మందినేర్చుకుంటున్నారు..
అయి భీమవరంలోని జడ్పి పాఠశాలలోని 151 మంది విద్యార్థులకు నా వద్ద డ్రాయింగ్ నేర్చుకుంటున్నారు, వీరంతా మంచి నైపుణ్యం సాదిస్తున్నారు, 1, 2 తరగతులకు ప్రభుత్వ టెస్ట్ బుక్స్ లో బొమ్మలు వేశారు. విద్యార్థుల్లో మంచి సృజనాత్మక ఎక్కువగా ఉంటోంది. ప్రభుత్వ సహకారం అందిస్తే చిత్ర లేఖనంలో ప్రపంచం గర్వించే చిత్రకారులు తయారవుతారు. ప్రతి ప్రభుత్వ పాఠశాలలో తప్పనిసరిగా చిత్రలేఖనం ఉపాధ్యాయులు నియమిస్తే మంచి ఫలితాలు సాధించవచ్చు.
తాతోలు వీరభద్రచార్యులు (చిట్టి), చిత్రకారుడు