ఆకివీడు: మౌలిక వసతులు లేకపోతే అభివృద్ధి లేనట్లేనని కేంద్ర ఉపరితల శాఖామంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. ఆకివీడులో 32 జాతీయ రహదారుల ప్రాజెక్టు పనులకు ఆయన సోమవారం శంకుస్థాపన చేసారు. పామర్రు నుంచి ఆకివీడు వరకు గల 165NH నెంబరు జాతీయరహదారి విస్తరణ పనులకు నేరుగా శంకుస్థాపన చేయగా రాష్టంతోపాటు ఇతర ప్రాంతాల్లోని మరో 81 పనులకు రిమోట్ ద్వారా శంకుస్థాపన చేశారు, అలాగే మరో 7 ప్రాజెక్టులను రిమోట్ ద్వారానే ప్రారంభించి జాతికి అంకితం చేశారు.
ఈ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ కేంద్రంలో భాజపా ప్రభుత్వం అదికారంలోకి వచ్చిన తరవాత అనేక అభివృద్ది కార్యక్రమాలు చేపట్టామని చెప్పారు. జాతీయరహదారులు, జలరవాణా మార్గాలు మెరుగుపరిచేందుకు కృషి చేస్తున్నామని వివరించారు.
ఈ సమావేశంలొ రాష్ట్ర రహదారుల-భవనాల శాఖామంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ నితిన్ గడ్కరీని పొగడ్తలతో ముంచెత్తారు. నితిన్ కేంద్ర పంచాయతీరాజ్ శాఖామంత్రిగా పనిచేసినప్పుడు రాష్టానికి నుంచి సహకారం ఆందించారని కొనియాడారు. ప్రస్తుత పరిస్థితుల్లో రూపాయి పెట్టుబడి పెట్టినా చేతులెత్తి నమస్కరించాలని అలాంటిది రూ. వేల కోట్ల ప్రాజెక్టులకు శంకుస్దాపన చేయడం ఎంతో ఆనందదాయకమన్నారు. మీ నాయకత్వాన్ని ఎప్పుడూ రాష్ట్ర ప్రజలు మరిచిపోలేరని కేంద్ర ఉపరితల శాఖామంత్రి నితిన్ గడ్కరీని ఉద్ధేశించి అన్నారు.
ఈ కార్యక్రమంలో నరసాపురం పార్లమెంటు సభ్యుడు గోకరాజు గంగరాజు మాట్లాడుతూ సరికొత్త సాంకేతికతో రవాణా మార్గాలు మెరుగుపరిచేందుకు కృషి చేస్తున్నారని అన్నారు. రాష్టంలోని అనంతపురం మరిచి అమరావతికి రూ20 వేల కోట్లతో రహదారి నిర్మాణం చేపడుతున్నారని ఆయన వివరించారు. ఇది పూర్తీ అయితే 6 గంటల్లోనే రాయలసీమ ప్రాంతాల నుంచి అమరావతికి చేరుకోవచ్చని అన్నారు.
అలాగే గతంలో కంటే గ్రామాలు సీసీ రహదారులతో మెరుగు పడ్డాయని ఆయన తెలిపారు ఉపాధి హామీ పథక నిధులను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమర్ధంగా వినియోగింఛుకోగలిగారని చెప్పారు. భాజపా ప్రభుత్వం వచ్చిన తరువాత గ్రామాల్లో ఈ మార్పు వచ్చిందని ఆయన వివరించారు. అన్ని ఓడరేవులను రహదారులకు అనుసందానం చేస్తున్నారని తెలిపారు.
యూపీఏ ప్రభుత్వల ఉన్నప్పుడు రోజుకు 12 కిలోమీటర్ల రహదారి మాత్రమే నిర్మించగలిగారని భాజపా ప్రభుత్వం వచ్చిన తరువాత సాంకేతికతను వినియోగిస్తూ రోజుకు 28 కిలోమీటర్ల రహదారి నిర్మిస్తున్నామని చెప్పారు. ఈ సమావేశంలో రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యుడు మాగంటి మురళీమోహన్ మాట్లాడుతూ ఇన్ని కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడం ఆనందదాయక మన్నారు. రహదారుల విస్తరణ చేసిన ఘనత మాజీ ప్రధాని వాజ్పేయ్ దక్కుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో ఉండి శాసనసభ్యుడు శివరామరాజు, ఎమ్మెల్సీ సోమ వీర్రాజు మాట్లాడారు, ఈ కార్యక్రమంలో రాష్ట్ర భాజపా అద్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్సి పాందువ్వ శ్రీను, మాజీ ఎంపీ కావూరి సాంబాశివరావు, మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ మూర్తి, జిల్లా భాజపా అద్యక్షులు కోడూరి లక్ష్మి నారాయణ, నాయకులు పరశురామరాజు, పాకా సత్యనారాయన, గోకరాజు రామరాజు, శ్రీనివాస వర్మ తదితరులు పాల్గొన్నారు.