Date: 09-01-2019
ఆకివీడు: కోడి పందేలు నిర్వహిస్తే శిక్షార్హులవుతారని తహసీల్దార్ వి. నాగార్జునరెడ్డి అన్నారు, మంగళవారం తహసీల్దార్ కార్యాలయంలో కోడి పందేలు నియంత్రించే విదంగా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ హైకోర్టు ఉత్తర్వులు మేర సంక్రాంతి పండుగ పురస్కరించుకుని గ్రామాల్లో కోడి పందేలు, పేకాట, గుండాట, జూదం నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు చేపట్టి, కేసులు నమోదు చేస్తారని హెచ్చరించారు.
పొలాలు, గార్డెన్లు, ఆక్వా చెరువులు, బహిరంగ ప్రదేశాల్లో పందేలు బరులు ఏర్పాటు చేస్తుంటే వెంటనే ద్వంసం చేయాలన్నారు. అవసరమైతే కేసులు నమోదు చేసి అరెస్టులు కూడా చేయవచ్చన్నారు. ముందస్తు చర్యగా కొంత మందిపై బైండోవర్ కేసులు పెట్టామన్నారు. పండుగ సమయాల్లో ఆనందంగా ఉండాలి కాని ఇటువంటి చెడు విష సంస్కృతికి పోకూడదన్నారు. గ్రామాల్లో వీటిపై టాంటాం, మైకుల ద్వారా ప్రజలకు తెలియజేయాలన్నారు అనంతరం ఎంపీడీవో ప్రభాకర్, ఎస్‌ఐ కె. సుధాకరరెడ్డి, ఎక్సైజ్ సీఐ జయరాం సతీష్ బాబు మాట్లాడారు. కార్యక్రమంలో ఎక్సైజ్ ఎస్‌ఐ దుర్గా ప్రసాద్, పోలీస్ హెడ్ కానిస్టేబుల్ డివి రమణ, వ్యవసాయాధికారి నిమ్మల శ్రీనివాసు, వర్మ, ఎంఈవో రవీంద్ర, పంచాయతీ కార్యదర్శి ఠాగూర్, విఆర్వోలు, కార్యదర్శులు, పోలీసులు, అధికారులు పాల్గొన్నారు