- నేటీ రాత్రి స్వామివారి కళ్యాణం
- 14న పల్లకి సేవ
ఆకివీడు : సుబ్రహ్మణేశ్వరస్వామి షష్ఠి మహోత్సవాల ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. స్ధానిక అనాలా చెరువు గట్టు వద్ద వేంచేసియున్న వల్లీ సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి కల్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయ ప్రాంగణంలో భారీ ఎత్తున చలువ పందిళ్లు వేస్తున్నారు. ఆలయ ప్రాంగణం విద్యుత్ దీపాలతో ఆలంకరించారు. చైర్మన్ కొల్లిపర లక్ష్మణరావు మాట్లాడుతూ బుధవారం రాత్రి స్వామి వార్షిక శాంతి కల్యాణం, గురువారం తెల్లవారుజాము నుంచి షష్టి ఉత్సవంతో పాటు మధ్యాహ్నం స్వామికి అభిషేకం, సాయంత్రం తెప్పోత్సవం, శుక్రవారం పల్లకి సేవ జరుగుతుందన్నారు. భక్తులు స్వామిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వికరించాలన్నారు.