స్థానిక పెద్దింట్లమ్మ ఆలయంలో చోరీ జరిగింది. ఆలయ పూజారి, పోలిసుల కధనం మేరకు.. అర్చకుడు మొవ్వ ప్రభాకర్రావు మంగళవారం ఉదయం 5 గంటలకు ఆలయానికి వెళ్లి చూసేసరికి తలుపులు తెరిచి ఉన్నాయి దింతో అయన ఈవో ఆర్ పి ఆర్ కిషోర్ తో పాటు పాలకవర్గం సబ్యులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న ఎస్సై సుధాకర్ రెడ్డి ఆలయానికి వచ్చి పరిశిలించగా దొంగలు ఇనుపరాడ్ తో ఆలయ తలుపులు పగలకొట్టి, బీరువాను చిందరవందర చేసారు. వెండి పళ్లెం, శఠగోపం ఇతర వస్తువులను ఎత్తుకెళ్లారు. గర్భగుడి తలుపుల ఎంతటికి తెరుచుకోకపోవడంతో దొంగలు వారి వెంట తెచ్చుకున్న ఇనుప వస్తువులను అక్కడే వదిలి వెళ్లారు. దీనిపై ఈవో కిషోర్ పిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసారు. క్లూస్ టీమ్ ఎస్సై రాజేష్, ఏఎస్సై రాధాకృష్ణ , ఆకివీడు హెచేసి రమణతో కలిసి వివరాలు సేకరించారు.