రోడ్డు ప్రమాదం వివాదానికి దారితీసింది ఆకివీడు మండలం సిద్దాపురంలో సోమవారం ఉదయం టిఫిన్ తీసుకోవడానికి వచ్చిన అల్లూరి గాంధీ రాజు ను లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో లారీ ముందు టైరు కింద చిక్కుకోగా గాంధీ రాజుకి తీవ్రగాయాలు అయ్యాయి. దింతో గ్రామస్థులు గాంధిరాజును చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించి లారీ ని నిలిపివేశారు. గ్రామంలో ఉన్న ఎఫ్సిఐ వద్దకు తరచూ లారీ లు వచ్చిపోవడంవల్ల రహదారులు పాడైపోతున్నాయని, కొన్ని సందర్బాల్లో ప్రమాదాలు కూడా జరుగుతున్నాయని గ్రామస్థులు ఆందోళన చేపట్టారు. సుమారు 3 గంటల పాటు రాస్తారోకో చేసారు. ఎస్సై సుధాకర్రెడ్డి ఆందోళనకారులతో చర్చించిన సమస్య పరిష్కారం కాకపోవడంతో గోడౌన్ యజమానికి సమాచారం అందించారు. దింతో గోదాము యజనమని మూర్తిరాజు, రైస్ మిల్లెర్స్ సంఘం నాయకులూ వానపల్లి బాబురావు, లారీ యజమానుల సంఘం అధ్యక్షుడు వెంకటరావు ఘటన ప్రాంతానికి చేరుకుని గ్రామస్థులతో మాట్లాడారు. సమస్యకు పూర్తి పరిష్కారం చూపేవరకు లారీలను తిరగనియ్యమని గ్రామస్థులు తిమ్మరాజు , శివాజీ, బుజ్జిరాజు స్పష్టం చేసారు. గాంధీ రాజుకు అయ్యే వైద్యం ఖర్చుతో పాటు ద్విచక్రవాహనాన్ని మరమ్మతు చేయించి అప్పగిస్తామని, గోదాము తరలింపుపై గ్రామస్థులతో చర్చిస్తామన్నారు దింతో ఆందోళన విరమించారు.