Date : 19-DEC-2018
* వర్షపు నీటిలో పనల్ని దేవుతున్న రైతులు
* నారుమళ్లలో నీటిని తోడుతున్న అన్నదాత
* వర్షపు నీటిలో పనల్ని దేవుతున్న రైతులు
* నారుమళ్లలో నీటిని తోడుతున్న అన్నదాత
ఆకివీడు: పెదాయ్ తుపాను రైతులను నిండా ముంచింది. చేతికి అందివచ్చిన ఖరీఫ్ పంటను నేలపాలుచేసింది. తడిసి ముద్ద అయిన ఖరీఫ్ పంటను దక్కించుకునే ప్రయత్నంలో రైతులు తల మునకలయ్యారు. పలు ప్రాంతాల్లో పవలపై ఉన్న వరి నీట మునిగింది. వరి కంకులు నానకుండా ఉండేందుకు నీటిలో ఉన్న వాటిని దేవుతున్నారు. గట్లపై వేసి ఆరబెడుతున్నారు. పలు చోట్ల ధాన్య రాశులు, పడుగులు తడిసి ముద్దయ్యాయి. అసలే నెంబుతో సతమతమవుతున్న రైతాంగాన్ని పెథాయి మరింత ఇబ్బందికి గురిచేసి ధాన్యాన్ని తడిసి ముద్ద చేసింది. ఆ ధాన్యాన్ని ఆరబెట్టడానికి కూడా అవకాశంలేకుండా పోయింది.
తడిసిన ధాన్యాన్ని రాయితీలిచ్చి ప్రభుత్వం తక్షణమే కొనుగోలు చేయాలని పలువురు రైతులు, రైతు సంఘాలు కోరుతున్నాయి. ఇదిలా ఉండగా ముందస్తు దాళ్వా సాగు కోసం చేసిన నారుమళ్ళును చెల్లా చెదురు చేసింది. విత్తనాలు కొట్టుకుపోయాయి. కొన్నిచోట్ల పోగుపఢి, మెలికెపడి మొలకరాని పరిస్టితి నెలకొంది. మలడలంలోని 2 వేల ఎకరాల్లో గింజలు వెదజల్లారు వెదజల్లిన గింజలు కూడా ఇదే పరిస్దితిలో దెబ్బతిన్నాయి. మళ్లీ నారుమళ్లు వేసేందుకు ప్రభుత్వం తక్షణం విత్తనాన్ని రైతులకు ఉచితంగా అందజేయాలని పలువురు రైతులు కోరుతున్నారు. పెథాయి నష్టాన్ని వెంటనే అందజేసి దాళ్వా సాగుకు సహకరించాలని కోరుతున్నారు.