DATE : 29-DEC-2018
ఆకివీడు: హనుమాన్ చాలీసా పారాయణతో ఆకివీడు ప్రాంతం హోరెత్తిందీ. ప్రపంచ శాంతి కోసం చేపట్టిన మహాయజ్ఞాన్ని భక్తులు విజయవంతం చేశారు. 10 వేల మంది భక్తులతో కోటి పారాయణను దత్త పీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామీజీ చేయించారు. శాంతి హోమం, పూర్ణాహుతిలో స్వామీజీ పాల్గొన్నారు. అంజనీపుత్రుడికి తమలపాకులతో అభిషేకం చేసి హారతి ఇచ్చారు. కోటి హనుమాన్ చాలీసా పారాయణ మహాయజ్ఞం ప్రారంభించేందుకు ముందు స్వామీజీ జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్బంగా స్వామీజీ మాట్లాడుతూ హనుమంతుడు మహా శక్తిశాలి అన్నారు. నంసారమనే సాగరంలో సంతోషం, బాద అన్నీ ఉంటాయన్నారు.
హనుమద్ పారాయణ చేస్తే హనుమాన్ శక్తి పెరిగి ప్రపంచం శాంతియుతంగా వర్ధిలుతుందని చెప్పారు. ఎమ్మెల్యే శివరామరాజు, మాజీ ఎంపీ కనుమూరి బాపిరాజు దంపతులు, జెడ్పి వైసఛైర్మెన్ మన్నే లలితాదేవి దంపతులు, ఏఎంసీ ఛైర్మన్ మోటుపల్లి ప్రసాద్, మాజీ సర్పంచ్ గొంట్లా గణపతి, బచ్చు సరళకుమారి, బొర్రా సుజాత, వినియోగదారుల రక్షణ మండలి రాష్ట్ర సభ్యుడు బొబ్బిలి బంగారయ్య, దత్త క్షేత్రం కార్యదర్శి కె.త్రినాథ కృష్ణమూరి పాల్గొన్నారు.