ఆకివీడు: లోక కళ్యాణం కోసం ఈనెల 29న ఆకివీడు జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహించనున్న హనుమాన్ చాలీసా పారాయణ మైకు ప్రచారాన్ని ఎమ్మెల్యే శివరామరాజు స్ధానిక దత్త క్షేత్రం నుంచి బుధవారం ప్రారంబించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గం అభివృద్ధి చెందాలనే లక్ష్యంగా మహా కార్యక్రమం తల పెట్టినట్టు చెప్పారు. ప్రతి ఒక్కరూ హాజరై జయప్రదం చేయాలని కోరారు కార్యక్రమంలో ఆలయ ట్రస్టీ కంభంసాటి కృష్ణమూర్తి, ప్రజాప్రతినిధులు వెంకట్రావు, నరసింహారావు, నాగరాజు, సుబ్బారావు భక్తులు పాల్గొన్నారు.
వైభవంగా హనుమాన్ చాలీసా పారాయణ