* అటకెక్కిన పూడికతీత ప్రతిపాదనలు
* రోజు రోజుకు కుచించుకుపోతున్న వైనం
ఆకివీడు: పశ్చిమ, కృష్ణా డెల్టాలకు ప్రధాన మురుగు కాల్వ ఉప్పుటేరు నిర్లక్ష్యపు నీడలో కొట్టు మిట్టాడుతోంది. పాలకులు, అధికారులు పట్టించుకోకపోవడంతో రోజు రోజుకు కుచించుకుపోతుంది. ఐదు దశాబ్దాలుగా పూఢికలు తీయడం మానేశారు. దీంతో ఏటా అడుగున్నర మేర పూడిక పేరుకుని మురుగు నీటి ప్రవాహానికి తీవ్ర అటంకం ఏర్పడుతుంది. కృష్ణా, పశ్చిమ డెల్టాలోని లక్షల ఎకరాలకు అవుట్లెట్ గా ఉన్నఉప్పుటేరు లో ఫూఢికలు పేరుకుపోవడం మురుగు నీరు దిగువకు సరిగా ప్రవహిరిచడం లేదు. ఇటీవల పూడిక మరింతగా మేటలు వేసింది. దీంతో సముద్రపు నీరు ఎగువకు ప్రవహించే పరిస్థితులు ఏర్పడ్డాయి. సహజసిద్ధంగా ఏర్పడిన ఉప్పుటేరు ౩6 మైళ్ల విస్తీర్ణంలో 25 వేల క్యూసెక్కుల నీటి ప్రవాహ సామర్ధ్యం కలిగిఉంది. ఫూఢికల వల్ల ప్రస్తుత నీటి ప్రవాహ సామర్ధ్యాల 6 వేల నుంచి 8 వేల క్యూసెక్కుల పడిపోయింది.
కృష్ణా, పశ్చిమ డెల్జాలకు దెబ్బ
ఉప్పుటేరులో ఫూఢికల వల్ల కృష్ణా, పశ్చిమ డెల్టాలకు తీవ్ర ముప్పు ఏర్పడనుంది. పశ్చిమ డెల్టాలోని 52 తీర గ్రామాలు, కృష్ణా డెల్టాలోని 12 తీర గ్రామాల్లో సుమారు 21 మేజర్ డ్రెయిన్లు, మరో 40 వంట కాల్వల నీరు ఉప్పుటేరులోకి ప్రవేశిస్తుంది. నీటి ప్రవాహం మందగించడంతో పంట, మురుగు కాల్వలో కూడా ఫూడికలు పేరుకుపోతున్నాయి. దీనివల్ల డెల్టాలోని కాల్వల వ్యవస్థ నిర్వీర్యమవుతుందని, ఉప్పునీరు ఎదురు ప్రవహించే ఉప్పుకయ్యలుగా మారే అవకాశం ఉందంటున్నారు.
ఉప్పుటేరు విస్తీర్ణం : 36 మైళ్లు
నీటి ప్రవాహ సామర్థ్యం: 25 వేల క్యూసెక్కులు
ప్రస్తుత సామర్థ్యం : 6-7 వేల క్యూసెక్కులు
ఉప్పుటేరు ప్రభావిత గ్రామాలు: 64
చొచ్చుకొచ్చే డ్రెయిన్లు: 21
ప్రవహించే వంట కాల్వలు: 42
డ్రేడ్జింగ్ కోసం అంచనాలు రూ. 111 కోట్లు
నాలుగున్నరెళ్ళ నుంచి వాయిదా
ఉప్పుటేరులో ఫూఢికలు తీసేందుకు ప్రభుత్వం గత నాలుగున్నర ఏళ్ల నుంచి వాయిదా వేస్తూ వస్తుంది. ఈ ఏడాదీ కూడా పూడిక పనులు చేపట్టే అవకాశాలు కనిపించడంలేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. రెండేళ్ల క్రితం ఉప్పుటేరు తవ్వకానికి సర్వే చేయించిన ప్రభుత్వం రూ.80 లక్షల మేర వెచ్చించింది. అదే సమయంలో ఉప్పుటేరు డ్రైనేజీ డివిజన్ ద్వారా డెడ్జింగ్ పనులకు ప్రభుత్వం అనుమతి కోరింది. రూ.111 కోట్లకు ప్రతిపాదనలు పంపారు. సీ మౌత్ వద్దఉప్పుటేరుకు నిరంతరం డ్రెడ్జింగ్ చేపట్టాలని మిత్ర కమిటీ 1969లో సూచించింది. కొన్నేళ్లు చేపట్టాక అక్కడ పనిచేసే డ్రెడ్జర్‌ను 1999 పాత ఇనుముకు విక్రయించారు.
రైల్వే వంతెన పనులతో
ఆకివీడు మండంలో దుంపగడప గ్రామ సమీపంలో రైల్వే వంతెన వద్ద ఉప్పుటేరు పూర్తిగా పూడుకుపోయింది. రెండేళ్లుగా రెండో రైల్వేలైన్ కోసం వంతెన కోసం వంతెన నిర్మాణ పనులు చేపట్టడంతో సమస్య తలెత్తింది.ఈ పూడిక తొలగించేందుకు రెండేళ్ల సమయం పట్టే అవకాశం ఉందంటున్నారు. ఎన్నికల సీజన్ కావడంతో ఈ ఏడాది కూడా పూడిక పనులపై పాలకులు, అధికారులు దృష్టి పెట్టే అవకాశాలు కనిపించడంలేదని రైతులు ఆందోళన వ్యకతం చేస్తున్నారు. రూ.111 కోట్లతో పనులు చేపట్టకపోతే పంట పొలాలు మునిగి రూ.1000 కోట్ల నష్టం వచ్చే అవకాశాలు ఉన్నాయని అవేదన వ్యక్తం చేస్తున్నారు.